గడచిన 24 గంటల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 13 కరోనా కేసులు, సూర్యాపేట జిల్లాలో 21 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని జిల్లా వైద్య అధికారులు సూచించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా కరోనా బులెటిన్
By Naga Babu
-
Previous article
Next article