యాదాద్రి ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం వచ్చిన ఆదాయం ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా భక్తులు వివిధ రూపాల్లో రూ.100 టికెట్ల దర్శనం, కొబ్బరికాయ విక్రయం, విఐపి దర్శనం, అన్నదానం విరాళాల, వేద ఆశీర్వచనం, సుప్రభాత సేవ, వాహన పూజ, యాద ఋషి నిలయం, పాత గుట్ట ద్వారా స్వామివారి ఖజానాకు రూ.8,80,317 ఆదాయం వచ్చిందన్నారు.