కేంద్రం మరో సంచలన నిర్ణయం… గాంధీకి ఇష్టమైన కీర్తన తొలగింపు

-

కేంద్రం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్ధాలుగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలికింది. గణతంత్ర వేడుకల ముగింపులను పురస్కరించుకుని ఈనెల 29న ఏర్పాటు చేసే ‘బీటింగ్ రిట్రీస్’ లో మహాత్మా గాంధీకి ఇష్టమైన కీర్తనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా గాంధీకి ఇష్టమైన క్రైస్తవ కీర్తన ‘అబైడ్ విత్ మీ’ని తొలగించారు. ఈసారి ‘సారే జహా సే అచ్చా’తో కార్యక్రమాన్ని ముగింపు చెప్పనున్నారు. అయితే దీనిపై ప్రతిక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ‘అబైడ్ విత్ మీ’ని తొలగించడంపై గాడ్సెపై బీజేపీకి ఉన్న ప్రేమను తెలియజేస్తుందని కాంగ్రెస్ విమర్శించింది.

ఇటీవల ఉంటే ఇటీవల అమర్ జవాన్ జ్యోతిని తరలించడంపై కూడా వివాదం రాజుకుంది. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్ లో విలీనం చేయడం పట్ల కూడా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అయితే కేంద్ర మాత్రం అమర్ జవాన్ జ్యోతిని ఆర్పేయడం లేదని కేవలం నేషనల్ వార్ మెమోరియల్ లోనే విలీనం చేస్తున్నామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news