రంగారెడ్డి జిల్లాలో కరోనా కల్లోలం

రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 843 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 432, వికారాబాద్ 89, రంగారెడ్డి జిల్లాలో 322 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలన్నారు.