రిటైర్మెంట్ పై స్పందించిన స్టార్ ప్లేయర్ సానియా మీర్జా..

రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత దీనిపై తొలిసారిగా స్పందించారు స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా. ఇటీవల ఆమె టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం ఆడుతున్న టోర్నీనే చివరిదని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న సమయంలో సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయంపై పశ్చాత్తాపడుతున్నట్లు వెల్లడించింది. నిర్ణయం సరైనదే అయినా.. తాను రిటైర్మెంట్ ప్రకటించిన సమయం సరైనది కాదంటూ.. వెల్లడించింది. ఈ విషయంలో తాను తొందరపడినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పుడు దానికి చింతిస్తున్నానని చెప్పుకొచ్చింది. తాజాగా ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించిన తరువాత ఈవ్యాఖ్యలు చేసింది.

భారత్ తరుపున టెన్నిస్ క్రీడకు ఎనలేని సేవ చేశారు సానియా మీర్జా. 2001లో తన కెరీర్ ను ప్రారంభించిన సానియా మీర్జా ఇప్పటి వరకు ఆటను ఆస్వాదించారు. డబుల్స్ లో ఒకనొక సమయంలో టాప్ ర్యాంకులో నిలిచారు. 2010లో పాక్ క్రిెకెట్ స్టార్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.