కూకట్‌పల్లిలో పేలుడు

మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి వెంకట్రావునగర్లోని ఓ ఇంట్లో ఈ మధ్యాహ్నం పేలుడు సంభవించింది. కంప్రెసర్ గ్యాస్ లీక్ అవడంతో పేలుడు సంభవించగా.. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఇంటి తలుపులు, కిటికీలు, సామానులు ధ్వంసం అయ్యాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.