‘గ్యాస్ లీకేజీ.. చెలరేగిన మంటలు’

జవహర్‌నగర్ శ్రీరామ్‌నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగాయి. పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై బయటకు పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది.