తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా నడుస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అయితే ఇక్కడ వెరైటీ యుద్ధం జరుగుతుంది. సీఎం కేసీఆర్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ చేస్తుంటే..మంత్రి కేటీఆర్‌ని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. తాజాగా ఎరువుల విషయంలో కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లు వార్ నడుస్తుంటే…రైతుల సమస్యలపై కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు వార్ జరుగుతుంది.
తాజాగా రైతుల సమస్యలపై చర్చకు సిద్ధమని కేటీఆర్, రేవంత్‌లు ఛాలెంజ్ చేసుకున్నారు. ఇదే క్రమంలో ఓ న్యూస్ చానల్ ఇద్దరు నేతలని ఓపెన్ డిబేట్‌కు పిలిచింది. కానీ ఆ డిబేట్‌కు రేవంత్ రెడ్డి రాగా, కేటీఆర్ హ్యాండ్ ఇచ్చారు. ఆ డిబేట్లో రేవంత్, కేటీఆర్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో కేటీఆర్..ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ పేరుతో కార్యక్రమం పెట్టుకుని రిస్క్‌లో పడ్డారు. అందులో కేటీఆర్‌ని ప్రశ్నలతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేశారు.
ముఖ్యంగా దళితబందు ప్రశ్న చిక్కుల్లో పడేసింది. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామని అన్నారు కదా…ఇప్పుడు వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ధరణిలో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, సమస్యలు ఉన్నాయని ప్రభుత్వమే ఒప్పుకొంటున్నా ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. అటు రేవంత్ రెడ్డితో చర్చకు వెళ్తానని చెప్పి, ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
అయితే 420లతో తాను చర్చ చేయనని కేటీఆర్ సమాధానమిచ్చారు. అయితే దీనికి కూడా కౌంటర్లు పడిపోయాయి. అక్రమ పాస్‌పోర్టులు, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆరే క్రిమినల్ అని, అలాగే టీఆర్ఎస్లో ఎంతమంది క్రిమినల్ కేసులు ఎదురుకుంటున్నారో కేటీఆర్‌కు తెలియదా? అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అయ్యాయి. ఇలా ఆస్క్ కేటీఆర్ పేరిట ప్రోగ్రాం పెట్టుకుని అనసవసరంగా రిస్క్‌లో పడ్డారు. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలిసింది.