వారికి లక్షణాలు ఉంటేనే కరోనా టెస్ట్..కేంద్రం కీలక ఆదేశాలు..!

కరోనా విజృంభణ మళ్ళీ మొదలైంది. దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఇతర ఆపరేషన్ ల కోసం వచ్చిన వారికి సైతం కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆసుపత్రిలో సర్జరీలు చేయించుకున్న వారికి కరోనా లక్షణాలు ఉంటేనే టెస్ట్ లు చేయాలని ఆదేశించింది. సర్జరీ చేయించుకున్న వారిలో కరోనా లక్షణాలు లేనప్పుడు టెస్ట్ అవసరం లేదని తెలిపింది. అంతే కాకుండా కరోనా నిర్ధారణ అయితే తీసుకోవాల్సిన చికిత్సపై వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. అంతేకాకుండా ఎన్ 95 మాస్క్ రోజంతా ధరించవచ్చని…. ఇక క్లాథ్ మాస్క్ ను 8 గంటలకు ఒకసారి మార్చి కొత్త మాస్క్ ధరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.