కొడంగల్: పట్టణంలోని బస్టాండులో ఉన్న ఓ హోటల్, దుకాణాన్ని ఆర్టీసీ అధికారులు సీజ్ చేసి, యజమానుల లైసెన్సులను రద్దు చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు దుకాణాదారులు అద్దె చెల్లించలేదు. నిబంధనల ప్రకారం బుధవారం దుకాణాదారుల లైసెన్సులను తొలగించి సీజ్ చేశారు. జిల్లా ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ దుకాణాదారులకు నోటీసులు పంపించి వాటిని మూసి వేయించారు.
వికారాబాద్ : కొడంగల్ బస్టాండ్లో దుకాణం సీజ్
-