రంగారెడ్డి : SRD: తప్పుల సవరణకు నేడే చివరి తేదీ

exam
exam

ఈ ఏడాది పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, ఏవైనా తప్పులుంటే సవరణకు నేడు చివరి తేదీ అని జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ తెలిపారు. ఉపాధ్యాయులు పిడిఎఫ్ నామినల్ రోల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని, సవరించిన ప్రతిపై సంతకం చేసి మండల విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. www.bse.telangana.gov.in ద్వారా తప్పులు సవరించుకోవాలని అన్నారు.