ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భగా అమ్మవార్లకు దర్శించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సమ్మక్క సారలమ్మల సాక్షిగా తెలంగాణకు సీఎం కేసిఆర్ నుండి విముక్తి కలిగించే వరకు పోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటేవరకు తరిమి.. సోనియమ్మ రాజ్యం తీసుకొస్తానని, ఈ పోరాటంలో ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు.