హిందువులారా…తెలంగాణలో హిందూ రాజ్యం తీసుకురావాలి : బండి సంజయ్‌

-

హిందువులారా…తెలంగాణలో హిందూ రాజ్యం తీసుకురావాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన మహనీయుడైన శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి రావడం దురద్రుష్టకరమని చెప్పారు. శివాజీ బీజేపీ నాయకుడు కాదు… భరతమాత ముద్దు బిడ్డ. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడిన నేత అని తెలిపారు.

ఈ రాష్ర్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్లు తమ మతాన్ని చెప్పుకుంటే బాధ లేదు.. కానీ హిందువులు మాత్రం తాను హిందువునని చెప్పుకోలేని దుస్థితి నెలకొంది. ఎవరైనా హిందువని చెబితే… మత తత్వ శక్తిగా చిత్రీకరించడం దారుణమని ఫైర్‌ అయ్యారు. ఎంఐఎం నమ్మక ద్రోహ పార్టీ. విశ్వాస ఘాతక పార్టీ. భారత మాత తల్లి ఒడిలో ఉండే అవకాశమిస్తే…ఆ తల్లికే ద్రోహం చేస్తూ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న పార్టీ ఎంఐఎం అని ఆగ్రహించారు.

లవ్ జిహాద్ ఫేరుతో హిందూ మహిళలను కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదు. ఛత్రపతి శివాజీ స్పూర్తితో హిందూ ధర్మ రక్షణ, హిందూ రాజ్య స్థాపన కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో తెలంగాణలో రజాకార్ల, మొఘల్స్ రాజ్యం వచ్చే ప్రమాదం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news