వరంగల్: క్షుద్రపూజల కోడిగుడ్లు, నిమ్మకాయలు తిన్న సీఐ

వరంగల్ బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఆది, బుధవారాల్లో కొందరు వ్యక్తులు మూఢనమ్మకాలను నమ్మి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు వేయడం వల్ల వాహనదారులు భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్ ఆదివారం వాహనదారులకు, స్థానిక ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అక్కడ ఉన్న కొబ్బరికాయల నీరు తాగి, కోడిగుడ్లను తిని వాటి వల్ల ఏమీ కాదని తెలిపారు.