వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

వరంగల్ నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి న్యాయస్థానం గురువారం శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారిలో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు మరో 18 మందికి రూ.25,100 జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప తీర్పు ఇచ్చినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ ఈరోజు తెలిపారు.