మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లకు సమర్పించిన కానుకల లెక్కింపు కొనసాగుతుంది. రెండో రోజు గురువారం 116 హుండీలను తెరచి లెక్కించగా రూ.2 కోట్ల 50లక్షల 62వేల ఆదాయం సమకూరింది.
మొత్తం 497 హుండీలలో ఇప్పటి వరకు 181 హుండీల లెక్కింపు పూర్తి కాగా, రెండు రోజులు కలిపి ఆదాయం రూ.3 కోట్ల 85లక్షల 22వేల ఆదాయం అందింది. దేవాదాయ శాఖ అధికారులు నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు.