మేడారం: జంపన్నవాగు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని ఆదివారం కావడంతో నేడు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రైవేటు వాహనాలలో రావడంతో జంపన్న వాగు నుండి హరిత హోటల్, ఆర్టీసీ బస్టాండ్ నుండి వీఐపీ పార్కింగ్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు.