కార్మికులకు అండగా ఉంటా

  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వ‌రంగ‌ల్ జ‌న‌వ‌రి 6 : కార్మికుల‌కు ఎల్ల‌వేళ‌లా అండగా ఉంటాన‌ని ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ అన్నారు. గురువారం ఆయ‌న మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న అర్బన్ మలేరియా వర్కర్స్ యూనియన్ టీఆర్ఎస్ కేవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కార్మికులకు అండగా తెలంగాణ ప్రభుత్వ ఉందని తెలిపారు. కార్మికుల సమస్యలు ఏప్పటికప్పుడు పరిష్కరిస్తూ కార్మికులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు బోగి సురేష్, మున్సిపల్ అధ్యక్షులు గాదే కుమార్, మలేరియా అధ్యక్ష కార్యదర్శులు మేకల సమ్మయ్య, నద్దూనూరి రాజేష్ కన్న, పడాల రాంమూర్తి, మైదం అరోగ్యం, నరేష్, ఉమేందర్, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.