వరంగల్: ‘కాశిబుగ్గలో కిడ్నాపర్ కలకలం’

వరంగల్ జిల్లా కాశిబుగ్గలో శనివారం కిడ్నాప్ కలకలం రేపింది. బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి కాశిబుగ్గకు చెందిన ఓ బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు గమనించి, కిడ్నాప్ చేసే వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఆ వ్యక్తిని ఇంతేజార్ గంజ్ పోలీసులకు అప్పగించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.