నాగార్జున సాగర్ హిల్ కాలనీ సమీపంలో జలాశయం తీరంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. హిల్ కాలనీలోని సత్యనారాయణ స్వామి దేవాలయం వెనక వైపున నదిలోకి దిగే మార్గం మధ్యలో, ఓ మహిళ (45) మృతదేహం కుళ్లిపోయి కన్పించింది. సుమారు 15 రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని సాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు పేర్కొన్నారు.