ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
అన్న రజనీ కాంత్ పాట విన్నారుగా
మళ్లీ అదే మోత అదే పాట
మార్మోగిపోతోంది ఇవాళ తెలుగు రాష్ట్రాలకు
సంబంధించిన బీజేపీ వర్గాలలో
ఎందుకంటే ఇవాళ యోగిని గెలిపించింది
ఒక తెలుగు వాడు
ఆయనే వై సత్యకుమార్
ఆయన మన కడప వాసి..
బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలక వ్యక్తి
యోగి కి ఇవాళ తోడు మరియు నీడ
ఒక్క మాటలో తేల్చాలంటే
హీ ఈజ్ ఒన్ అండ్ ఓన్లీ సక్సెస్ ఫ్యాక్టర్
బిహైండ్ యోగి
యోగి అంటే ఫ్లవర్ అనుకుంటిరా…ఫైర్…తగ్గేదేలే అన్నట్లుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి…తన సత్తా ఏంటో నిరూపించారు.. ఎన్నో రకాల విమర్శలు…రైతు పోరాటాలు,రోజురోజుకూ ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుందని విశ్లేషణలు…ఇలా అన్నిరకాల నెగిటివ్ ప్రచారాలు…ఇవన్నీ దాటుకుని తనలో ఇంకా ఫైర్ తగ్గలేదని యోగి నిరూపించారు..మళ్ళీ చాలా దశాబ్దాల తర్వాత యూపీలో వరుసగా రెండో సారి అధికారం దక్కించుకున్న పార్టీగా బీజేపీ నిలిచింది.
యూపీ ప్రజలు మరొకసారి యోగికే పట్టం కట్టారు..అది కూడా తక్కువ మెజారిటీ కాదు…403 సీట్లకు గాను బీజేపీకి 272 సీట్లు దక్కాయి…ఇక బీజేపీకి గట్టి పోటీ అనుకున్న ఎస్పీకి కేవలం 126 సీట్లు మాత్రం వచ్చాయి…ఇక కాంగ్రెస్ కు దారుణంగా 2 సీట్లు రాగా,బీఎస్పీకి 1,ఇతరులకు 2 సీట్లు వచ్చాయి…అలాగే ఎంఐఎం పార్టీ యూపీలో ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది..మొత్తానికి యూపీ కా బాద్ షా యోగి అని మళ్ళీ నిరూపణ అయింది.
యోగి విజయాలకు అనేక కారణాలు ఉన్నాయి… అనేక పరిణామాలు నిర్ణయాలు యోగికి కలిసొచ్చాయి. ఇదే సమయంలో యోగి విజయానికి ఒక తెలుగోడు కృషి చేశారు. ఏపీకి చెందిన సత్యకుమార్ యోగి విజయంలో కీలకపాత్ర పోషించారు.బీజేపీ జాతీయకార్యవర్గంలో కీలకంగా పనిచేస్తున్న సత్యకుమార్..కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి. అంచెలంచెలుగా బీజేపీలో ఎదుగుతూ వచ్చిన సత్యకుమార్…జాతీయ స్థాయిలో కీలక నాయకుడుగా వ్యవహరిస్తూ ఇవాళ తన సత్తా చాటుకున్నారు.
యూపీ ఎన్నికల్లో యోగి వెనుకే ఉంటూ…బీజేపీ విజయం కోసం కష్టపడ్డారు. ప్రతి ఎన్నికల సభలో యోగి వెనుకే సత్యకుమార్ ఉన్నారు. ఆయనకు అవసరమైన ప్రతి సబ్జెక్ట్ దగ్గరుండి ప్రిపేర్ చేశారు. ముఖ్యంగా శాంతిభద్రతలని కట్టడి చేయడంలో యోగికి సహాయసహకారాలు అందించారు.ఎన్నికల హడావిడి మొదలయ్యి.. ముగిసే వరకు యోగితో పాటే సత్యకుమార్ ముందుకు నడిచారు. ఏదేమైనా ప్రశాంత్ కిశోర్ లాంటి కార్పొరేట్ స్థాయి పొలిటికల్ స్ట్రాటజిస్టుల కోసం జాతీయ పార్టీలు సైతం ఎగబడుతున్న ఈ రోజుల్లో ఒక తెలుగోడు….ఒక పెద్ద రాష్ట్రంలో విజయానికి కృషి చేయడం, సానుకూల ఫలితాలు సాధించడం గొప్ప విషయమే!
డియర్ సర్ కంగ్రాట్స్.
– పొలిటికల్ ఎఫైర్స్ – మనలోకం ప్రత్యేకం