భార‌త్‌లో నిజంగానే కోవిడ్ మూడో వేవ్ వ‌స్తుందా ? నిపుణులు చెబుతున్న‌ది నిజ‌మ‌వుతుందా ?

కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌లేదు. కానీ ఆగ‌స్టు నెల‌లోనే మూడో వేవ్ వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే కొంద‌రు నిపుణులు హెచ్చ‌రించారు. ఇక చాలా మంది నిపుణులు మాత్రం అక్టోబ‌ర్ లో మూడో వేవ్ వ‌స్తుంద‌ని అంటున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు మాత్రం మూడో వేవ్‌ను ప‌ట్టించుకోన‌ట్లు క‌నిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ల‌ను ఎత్తేస్తున్నారు. ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నారు. మ‌రి నిపుణులు చెబుతున్న‌ట్లు కోవిడ్ మూడో వేవ్ నిజంగానే వ‌స్తుందా ? ప్ర‌భుత్వాలు దాన్ని లైట్ తీసుకుంటున్నాయా ? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

కోవిడ్ మూడో వేవ్ ఎప్పుడు వ‌స్తుంది ? ఆగ‌స్టు, అక్టోబ‌ర్ కాదు.. ప్ర‌జ‌లు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించ‌డ‌కుండా తిరిగిన‌ప్పుడు వ‌స్తుంది. క‌దా.. అవును.. ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ల‌ను ఎత్తేస్తూ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు మళ్లీ ఎప్ప‌టిలాగే బ‌య‌ట తిరగ‌డం మొద‌లు పెట్టారు. అంతా అయిపోయింద‌ని, ఇక కోవిడ్ రాద‌ని అనుకుంటున్నారు. కానీ అది మ‌హ‌మ్మారి. విదేశాల్లో ఇప్ప‌టికే అనేక దేశాల్లో రెండు కాదు మూడు, నాలుగు వేవ్‌లు కూడా వ‌చ్చాయి. క‌నుక అది ఎప్పుడు దాడి చేసేది తెలియ‌దు. కానీ దాడి చేయ‌డం మాత్రం ప‌క్కా అని చెప్ప‌వ‌చ్చు. అయితే మనం జాగ్ర‌త్త‌గా ఉండ‌డంపైనే కోవిడ్ మూడో వేవ్ ఆధార‌ప‌డి ఉంటుంది.

పైన ఇచ్చిన చిత్రాలు చూశారు క‌దా.. వాటిని చూశాక ఎవ‌రి అభిప్రాయం అయినా ఒక్క‌టే. కోవిడ్ మూడో వేవ్ వ‌స్తుంద‌నే చెబుతారు. ఎందుకంటే అనేక చోట్ల చాలా మంది ప్ర‌జ‌లు పైన ఇచ్చిన చిత్రాల్లోలాగే తిరుగుతున్నారు. మాస్కుల‌ను ధ‌రించ‌డం లేదు. సామాజిక దూరం పాటించ‌డం లేదు. మాస్కుల‌ను ధ‌రించినా ముక్కు కింద‌కు ధ‌రించి తిరుగుతున్నారు. ఇంక ఇలా ఉంటే కోవిడ్ మూడో వేవ్ రాకుండా ఉంటుందా ? క‌చ్చితంగా వ‌స్తుంది. కానీ దాన్ని ఆపే శ‌క్తి మ‌న‌కే ఉంది. క‌నుక బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి. మూడో వేవ్ మూడో వేవ్ అంటున్నారు.. దాన్ని రాకుండా ఆపే శ‌క్తి మ‌న‌కే ఉంది క‌దా. అలాంట‌ప్పుడు మూడో వేవ్ గురించి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మ‌నం జాగ్ర‌త్త‌గా ఉంటే ఏ వేవ్ కూడా రాదు..!