ఎడిట్ నోట్ : ట్రిపుల్ ఆర్ చూశాను ఎలా ఉందంటే !

-

క‌థ ప‌రంగా నాకు రాముడు నచ్చాడు
పెర్ఫార్మెన్స్ ప‌రంగా భీముడు న‌చ్చాడు
వాడి అమాయ‌క‌త్వం త‌న వాళ్ల కోసం ఏదో చేయాల‌న్న త‌ప‌న
ఇవ‌న్నీ న‌చ్చాయి.. క‌నుక మంచి క‌థ క‌న్నా మంచి క‌థ‌నం
కాపాడుతుంది..ఈ సినిమాకు ఇంకాస్త క‌థ‌నం కావాలి
టేకింగ్..మేకింగ్ ..ఎడిటింగ్ వీటిపై మాట్లాడ‌ను..
కానీ శిఖరం ఇవాళ ఆయ‌న
ఆ శిఖ‌రం వేరొక ప్ర‌భావానికి లోను కాకూడ‌దు.

మూడేళ్లో లేదా ఐదేళ్లో ఈ సినిమా విష‌య‌మై రామ్ చ‌రణ్ కేటాయించారు.ఆ విధంగా రాజ‌మౌళి బృందంలోనే ఉండిపోయారు. సినిమా కోసం ఆగారు.. స‌మ‌యం వెచ్చించి మ‌రీ ఆగారు.. ఆ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రు హీరోలు కోట్ల గురించి ఆలోచించ‌క‌పోవ‌డం విశేషం.. వారి త్యాగం మ‌రియు అంకిత భావం ఈ సినిమా ! క‌నుక కష్టాన్ని గుర్తిస్తే చాలు.. రేప‌టి వేళ మ‌రో వెయ్యి కుటుంబాలు రాజ‌మౌళి మ‌రియు ఇత‌ర బృందం పేరు చెప్పుకుని అన్నం కాద్సార్ బిర్యానీయే తింటాయి.ఆ అవ‌కాశం చెత్త రివ్యూలు ఇవ్వ‌వు కానీ ఏవో 4 ప‌నికిమాలిన మాట‌లు మాత్రం చెబుతాయి.

టీ కొట్టు ద‌గ్గ‌ర ఏవో మాట‌లు.. ఎవ‌రు ఎక్కువ ఎవ‌రు త‌క్కువ అని న‌వ్వుకున్నాను. ఈ సినిమా రాసే రికార్డులు ఏంటి తిరగ‌రాసే రికార్డులు ఏంటి అని ఒక‌టే చ‌ర్చ మ‌రియు గోల. మీడియా గోల కూడా ఇదే! సోష‌ల్ మీడియా సోగాళ్ల గోల కూడా ఇదే! అంటే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, తార‌క్ మీ ముందుకు వ‌చ్చి కొట్టుకోవాలా ? అప్పుడు కానీ త‌గ్గ‌రా ? క‌థ ప‌రంగా తూకాల గోల అటుంచితే ఈ సినిమా న‌డ‌క బాగుంది. ఆయ‌న ఎంచుకున్న విష‌యాన్ని ఎప్ప‌టిలానే బాగానే చెప్పారు.

మాట‌లు అక్క‌డ‌క్క‌డ బాగున్నాయి..దోస్తీ పాట‌ను క‌థ‌కు అనుగుణంగా వాడిన ప‌ద్ధ‌తి బాగుంది. ఎత్త‌ర జెండా పాటలో ముగ్గురూ బాగున్నారు.. వాళ్ల‌తో పాటు ఇంగ్లీషు పిల్ల చాలా బాగుంది. ఆవిధంగా ఆమె సినిమాకు మంచి అట్రాక్ష‌న్.. అందాల భామ అలియా ఎంత బాగుందో ! ఈ విధంగా ఈ సినిమా నిజంగానే బాహుబ‌లిని ఎప్పుడో దాటేసింది. ఇక‌పై రాజ‌మౌళి మ‌రింత శ్ర‌ద్ధ వ‌హించాలి అన్న హెచ్చ‌రిక కూడా ఈ సినిమానే ఇచ్చింది.

థియేట‌ర్ల ద‌గ్గ‌ర కుటుంబాల‌ను చూశాను..ఆడ బిడ్డ‌ల‌ను మోసుకుంటూ మ‌గాళ్లు.. మ‌గాళ్ల నీడ వెంట ఆడాళ్లు.. అబ్బా! జ‌నం ఒక‌టే జ‌నం.. జాత‌ర‌లో ఉన్న జ‌నం మాదిరి ఉన్నారు. ఆనందించాను నేను..ఆనందించాలి మీరు.. కాలం ఏమ‌యినా చేస్తుంది..ఎంత‌యినా కూడా ఊడిగం చేయిస్తుంది.. ఆ విధంగా ఓ చిన్న ఫిక్ష‌న‌ల్ పాయింట్ ఇంత గొప్ప సినిమాకు కార‌ణం అయింది. గొప్ప అంటే విజువ‌ల్ ప‌రంగా కాదు వాళ్ల ముగ్గురి క‌ష్టం ప‌రంగా అని అర్థం.. గొప్ప క‌థ ప‌రంగా కాదు కలెక్ష‌న్ల ప‌రంగా కాదు కానీ
ఎమోష‌నల్ క‌నెక్టివిటీ అదిరిపోయింది.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి

Read more RELATED
Recommended to you

Latest news