వైసీపీ నేతలను చంపిన హంతకుడు కొడాలి నాని : వర్ల రామయ్య

-

అమరావతి : మంత్రి కొడాలి నాని పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపణలు చేశారు. గుడివాడకు చెందిన వైసీపీ నేతలు వంకా విజయ్ ,అడపా బాబ్జీల మృతికి మంత్రి కొడాలి వైఖరే కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బావ బామ్మర్దులైన ఇరువురు కొడాలి నాని ఎన్నికల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారని నిప్పులు చెరిగారు.

వంకా విజయ్ 2015లో సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సూసైడ్ నోట్ బయటకు రాకుండా కొడాలి నాని అడ్డుకున్నారని ఆరోపించారు. ఖర్చు పెట్టిన డబ్బు అంతా తిరిగి ఇస్తానన్న మంత్రి నాని ఇప్పుడు ముఖం చాటేయటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అడపా బాబ్జీ గుండెపోటుతో మరణించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో మంత్రి ఆగడాలపై డీజీపీ దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. క్యాసినో నిర్వహణకు సంబంధించి నూజివీడు డీఎస్పీ ఇచ్చిన నివేదిక ఏమైంది..? అని నిలదీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news