ఎడిట్ నోట్: టీడీపీ ‘పగ్గాలు’ పోటీ..!

-

ఏపీలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయి..వైసీపీ-టీడీపీల మధ్య ఎలాంటి రాజకీయ యుద్ధం నడుస్తోంది…ఇలాంటి అంశాలు కాసేపు పక్కన పెట్టేసి..అసలు టీడీపీలో జరుగుతున్న రాజకీయం ఏంటి? టీడీపీ భవిష్యత్ ఏంటి అనే దానిపై ఆ పార్టీలోనే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ పగ్గాలు దక్కేది ఎవరికి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎందుకంటే చంద్రబాబుకు వయసు మీద పడటమే కారణం.

ఆయనకు ఇప్పుడు 72 ఏళ్ళు ఉన్నాయి..కాబట్టి ఆయన ఎల్లకాలం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండలేరు. ప్రస్తుతానికి ఆయనే అధ్యక్షుడు..దూకుడుగా పనిచేస్తున్నారు. 2024లో పార్టీని గెలిపించుకోవడం కష్టపడుతున్నారు. అప్పుడు పార్టీ గెలిస్తే మళ్ళీ సీఎం అవుతారు..గెలవకపోతే మళ్ళీ పార్టీ కోసం కష్టపడతారు. కానీ ఎంతకాలం 2029కి వచ్చేసరికి బాబు దూకుడు తగ్గుతుంది. అప్పుడు ఖచ్చితంగా పగ్గాలు విషయంలో చర్చ నడుస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయినప్పుడు..జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ పగ్గాలు చేపట్టాలని డిమాండ్ ఎక్కువ వచ్చింది.

కానీ జూనియర్ రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రం టీడీపీలో ఎన్టీఆర్ పేరు వినబడుతూనే వచ్చింది. ఇక ఇక్కడ ఎన్టీఆర్ పేరుతో వైసీపీ ఆడే గేమ్ కూడా ఉంది. అంటే ఎన్టీఆర్‌ అభిమానుల మద్ధతు పొందడానికి..ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో బాబుపై ద్వేషం పెరిగేలా చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో కొందరు వైసీపీకి మద్ధతుగా ఉంటే..కొందరు టీడీపీకి మద్ధతుగా ఉన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

ఆ విషయం పక్కన పెడితే..ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి రారని క్లారిటీ వచ్చేసింది. మరి అలాంటప్పుడు టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారు అంటే డౌట్ లేకుండా లోకేష్ అని మెజారిటీ టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. పైగా పగ్గాలు చేపట్టే విషయంలో ఎన్టీఆర్ కంటే లోకేష్ వైపే టీడీపీ శ్రేణులు మొగ్గు చూపుతున్నాయి. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. నిజానికి లోకేష్ కంటే ఎన్టీఆర్ ఇమేజ్ పెద్దది..ఆయనకు రెండు రాష్ట్రాల్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్ బేస్ ఉంది. ఇక రాజకీయం ఎన్టీఆర్‌కు కొత్త కాదు.

అయినా సరే ఎన్టీఆర్ ఈ మధ్య రాజకీయంగా క్లారిటీ లేకపోవడం..ఏ ఇష్యూ ఇచ్చినా సరే..కర్రా విరగకూడదు..పాము చావుకూడదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే టీడీపీకి మద్ధతు ఇవ్వట్లేదు..అటు వైసీపీని విమర్శించడం లేదు. ఈ తీరు టీడీపీ శ్రేణులకు నచ్చడం లేదు. అసలు భవిష్యత్‌లో టీడీపీ పగ్గాలు తీసుకోవాలనుకుంటే..ఎన్టీఆర్ స్పందించే తీరు ఇది కాదని అంటున్నారు.

అదే సమయంలో పప్పు అని పిలిపించుకున్న లోకేష్ రాజకీయం చాలా మారింది. 2019 ఓటమి తర్వాత లోకేష్‌లో బాగా మార్పు వచ్చింది. తనని తాను మార్చుకున్నారు. టీడీపీ శ్రేణులకు అండగా నిలబడుతున్నారు. మాస్ లీడరుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. అందుకే టీడీపీలో లోకేష్‌కు మద్ధతు పెరిగింది. 2019 తర్వాత ఎన్టీఆర్ రావాలని కోరుకున్నవారే..లోకేష్ బెటర్ అనే పరిస్తితికి వచ్చేశారు. దీనికి కారణం ఎన్టీఆర్ తీరే అని చెప్పొచ్చు.

కాకపోతే సినీ రంగంలో అందరివాడుగా ఉన్న ఎన్టీఆర్..రాజకీయాల్లో తలదూర్చకూడదు అని ఆ తరహాలో ముందుకెళుతున్నారు. కానీ అదే టీడీపీ క్యాడర్ సపోర్ట్ దక్కడంలో మైనస్ అయింది. ఏదేమైనా ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు దక్కవు..ఒకవేళ ఆయన..గతంలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు పార్టీ పగ్గాలు లాక్కున్నట్లు జూనియర్ లాక్కున్న సరే..ఎన్టీఆర్‌కు టీడీపీ శ్రేణుల నుంచి మద్ధతు కూడా పెద్దగా దొరికేలా లేదు. మొత్తానికి టీడీపీ పగ్గాలు లోకేష్‌కే దక్కడం గ్యారెంటీ

అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news