పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు…!

-

చాల మంది విద్యార్థులు ఎంత చదివిన తలకెక్కదు లేదా అస్సలు చదవాలన్న ఆసక్తి రాదు. ఇలా అనేక సమస్యలని ఎదుర్కొంటారు. అయితే పరీక్షలు తప్పితే జీవితంలో ఊడిపోయినట్టు కాదు గుర్తుంచుకోండి. దీని కోసం క్లుప్తంగా ఇప్పుడే చదివి తెలుసుకోండి…. పైకి రావాలంటే పరీక్షల్లో ప్యాస్ అవ్వాలని ఎక్కడ లేదు. అలా అని పైకి వచ్చిన వాళ్ళు అంత పరీక్షల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉండాలనే లేదు. అమెరికన్ సొసైటీనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్పవాళ్లంతా డిగ్రీ లేని వాళ్లే. ఇంకా అమెరికాలో ఐతే 99 శాతం సెలెబ్రెటీలకు డిగ్రీలు లేవు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి.

ఇంట్లో తల్లితండ్రులు పిల్లలపై ఒత్తిడి వేస్తారు. నువ్వు ఒక డాక్టర్ కావాలి అనో లేదు అంటే ఐ.ఐ.టీ లో సీట్ సంపాధించాలి అని ఇలా ఎవరికీ ఏది నచ్చితే దానిపైన బాగా ఒత్తిడి చేస్తుంటారు. మరి కొంత మంది 6 వ తరగతికే ఐ .ఐ .టీ ఓరియెంటెడ్ అని ఏవేవో పేర్లు పెట్టి పిల్లలను ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇవేమి కరెక్ట్ కాదు. అందరు ఒకేలా ఉండరు. తల్లిదండ్రులు ఇది గమనించాలి. ఎవరి శక్తి వాళ్లకి ఉంటుంది అని తెలుసుకోవాలి. కొంత చదువుకుంటే మంచిది. అసలు డిగ్రీ అనేది లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి పెద్ద అర్హత కూడా కాదు కనీస డిగ్రీ ఉంటె మంచిది.

జీవితంలో పైకి రావాలి అంటే చదువు మాత్రమే ముఖ్యం కాదు. ఆసక్తి, పాషన్, గోల్స్, కళ వంటివి పైకి రావడానికి ఆయుధాలు. కాలేజీలో మనం నేర్చుకునేది జనరల్ సబ్జెక్టు మాత్రమే. కావాలని ఏది అనుభవాన్ని ఇవ్వదు. కనుక పరీక్షలో ఫెయిల్ అయినా జీవితంలో చాల సాధించొచ్చు. దాని కోసం జీవితాన్నే కోల్పోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news