జగన్‌తో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్..? కారణం అదేనా..?

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు దేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం విదితమే. ఓ వైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వయస్సు అయిపోతుండడం, మరోవైపు ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ అనుభవ రాహిత్యం, ప్రజలను కట్టిపడేసే వాక్చాతుర్యం లేకపోవడం, తప్పుల తడకగా మాట్లాడడం.. వంటి అనేక కారణాల వల్ల ఇప్పుడసలు టీడీపీని ఎవరు ముందుండి నడిపిస్తారోనని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడందరూ జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తున్న తెలుస్తోంది.

junior ntr might meet cm ys jagan

తమ పార్టీని నడిపించే నాయకుడు ఎవరా అని ఓ వైపు టీడీపీ శ్రేణులు ఆలోచిస్తుంటే.. మరొకవైపు ఆ పార్టీ వేళ్లన్నీ ఇప్పుడు జూనియర్ ఎన్‌టీఆర్ వైపు చూపిస్తున్నాయి. లోకేష్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో బెటరని పలువురు టీడీపీ సీనియర్ నేతలు అభిప్రాయ పడుతున్నారట. అందుకనే తారక్‌ను తెరపైకి తీసుకువచ్చి టీడీపీ పగ్గాలు ఆయనకు అప్పగించాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. అయితే చంద్రబాబు ఇందుకు ససేమిరా.. అంటారని కూడా మరొక వర్గం భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ భవిష్యత్తు ఏమిటా అని నేతలంతా ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

అయితే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌ను వైసీపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తుందని తెలిసింది. అందుకనే తారక్ నేడో, రేపో సీఎం వైఎస్ జగన్‌ను కూడా కలవనున్నాడట. ప్రస్తుతం ఏపీలో ఇదే వార్త బాగా ప్రచారమవుతోంది. అయితే తారక్‌ను ఏపీ ప్రభుత్వ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. మరి ఆయన జగన్‌ను కలుస్తారా.. లేదా..? ఏపీలో ముందు ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి..? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news