నిర్ణయం మార్చుకున్న కెసిఆర్, డిప్యూటి సిఎం గా కేటిఆర్…?

-

తెలంగాణాలో అసలు ఎం జరగబోతుంది, అదే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో ఎం జరిగే అవకాశాలు ఉన్నాయి…? కెసిఆర్ ఢిల్లీ వెళ్లి కేటిఆర్ ని సిఎం క్యాంప్ ఆఫీస్ లో కూర్చో బెట్టె అవకాశాలు ఉన్నాయా…? అసలు కెసిఆర్ ఆలోచన ఏ విధంగా ఉంది…? ఇప్పుడు తెలంగాణాలో జరిగే చర్చలు ఇవే. రాజకీయంగా తెరాస ఇప్పుడు చాలా బలంగా ఉంది. కెసిఆర్, కేటిఆర్ నాయకత్వ సామర్ధ్యం అందరికి స్పష్టంగా అర్ధమైంది.

రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి తిరుగు ఉండటం లేదు అనేది వాస్తవం. సరే అది పక్కన పెడితే మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని కేటిఆర్ విశ్వరూపం ఏంటో తెలంగాణాలో ప్రతిపక్షాలు చూసాయి. ఆయన వ్యూహాలకు దీటుగా అనేది పక్కన పెడితే కనీసం ఆయన మాటలకు సమాధానం చెప్పలేక జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ బిజెపి ఇప్పుడు తీవ్రంగానే ఇబ్బంది పడుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో కెసిఆర్ జోక్యం తక్కువ. తెలంగాణా భవన్ లో నిర్వహించిన సమావేశం మినహా ఆయన పెద్దగా మాట్లాడింది లేదు. కేటిఆర్ మాత్రం దావోస్ వెళ్ళి వచ్చినా సరే తెలంగాణాలో మాత్రం మున్సిపల్ ఎన్నికలు ఎలా అయినా గెలవాలని పట్టుదలగా ఉండి వ్యూహాలు సిద్దం చేసారు. పిన్ టూ పిన్ కేటిఆర్ దూకుడుగా వ్యూహాత్మకంగా అడుగులు వేసి విపక్షాలకు చుక్కలు చూపించారు.

సరే అది పక్కన పెడితే ఆ ఎన్నికల తర్వాత కేటిఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఆయన్ను సిఎం చేసి కెసిఆర్ గజ్వేల్ కి రాజీనామా చేసి గజ్వేల్ లో కవితను గెలిపించి తాను రాజ్యసభకు వెళ్లి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తారు అనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అవ్వకుండానే ఇప్పుడు మరో ప్రచారం బయటకు వచ్చింది.

తాను ఇప్పుడు ఢిల్లీ వెళ్లనని, కేటిఆర్ ని డిప్యూటి సిఎంని చేయడం ద్వారా పాలనపై పట్టు పెంచి అప్పుడు తాను ఢిల్లీ వైపు చూడాలని, ఉప ముఖ్యమంత్రిగా కేటిఆర్ సామర్ధ్యం బలపడిన తర్వాత తాను ఢిల్లీ ఆలోచన చెయ్యాలని, చిన్న తేడా వచ్చినా విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కేటిఆర్ ని డిప్యూటి సిఎం ని చేసే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news