ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కొత్త గవర్నర్‌గా మాజీ ఒడిశా మంత్రి బిశ్వభూషణ్ హరిచందన్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ రాష్ట్రపతి భవన్ కూడా ఉత్తర్వులను జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కొత్త గవర్నర్‌గా మాజీ ఒడిశా మంత్రి బిశ్వభూషణ్ హరిచందన్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ రాష్ట్రపతి భవన్ కూడా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో రేపో మాపో హరిచందన్ ఏపీ గవర్నర్‌గా బాధ్యతలను కూడా స్వీకరించనున్నారు. ఇక ప్రస్తుత గవర్నర్ నరసింహన్ కేవలం తెలంగాణకు మాత్రమే ఇప్పుడు గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. అయితే త్వరలోనే ఈయన్ను కూడా మార్చి తెలంగాణకు కూడా కొత్త గవర్నర్‌ను నియమిస్తారని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన విషయం విదితమే. కాగా ఇటు తెలంగాణతోపాటు, అటు ఏపీలోనూ రానున్న ఎన్నికల వరకు బలమైన పార్టీగా అవతరించాలని బీజేపీ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఏపీకి కొత్త గవర్నర్‌ను ఎంపిక చేయగా, త్వరలోనే తెలంగాణకూ నూతన గవర్న్‌ను నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక తెలంగాణకు కాబోయే గవర్నర్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న సీనియర్ బీజేపీ నాయకుడు అయి ఉంటారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న గవర్నర్ నరసింహన్‌కు కీలకమైన ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో పదవి ఇచ్చేందుకు కూడా అవకాశం ఉందని తెలిసింది. కాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న కె.లక్ష్మణ్ ఈ మధ్యే రెండు తెలుగు రాష్ర్టాలకు నూతన గవర్నర్లు వస్తారని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఘటనలు చోటు చేసుకుంటుండడం రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ చర్చనీయాంశమవుతోంది..!