కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఇతర పార్టీల్లో చేరగా.. త్వరలో మరో సీనియర్ నేత కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి త్వరలోనే ఆ పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగిన స్థానాలు వచ్చినప్పటికీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తెరాసలో చేరారు. ఈ క్రమంలో టీసీఎల్‌పీని తెరాసలో విలీనం కూడా చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరొక షాక్ తగలనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఇతర పార్టీల్లో చేరగా.. త్వరలో మరో సీనియర్ నేత కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి త్వరలోనే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ నేతల తీరు పట్ల విజయశాంతి అసంతృఫ్తితో ఉన్నారట. ఖమ్మం లోక్‌సభ సీటును విజయశాంతి ఆశించారట. అయితే ఆ సీటును మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి ఇచ్చారు. దీంతో ఆ వ్యవహారంపై విజయశాంతి అప్పట్లో అసంతృప్తితో రగిలిపోయారట. మరోవైపు రేణుకా చౌదరి వర్గీయులు విజయశాంతిపై విమర్శలు చేయడంతో ఆమె వాటిని తట్టుకోలేకపోయారట. ఈ క్రమంలోనే ఎన్నికల తరువాత నుంచి విజయశాంతి కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నట్లు తెలిసింది.
అయితే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే విజయశాంతితో రెండు సార్లు పార్టీ మారే విషయంపై చర్చించారట. దీంతో విజయశాంతి తన మనస్సు మార్చుకున్నారని సమాచారం. కాగా విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని బీజేపీలోనే ప్రారంభించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే తిరిగి సొంత గూటికి ఆమె చేరుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇందుకు గాను త్వరలోనే ఆమె అమిత్‌షాతో సమావేశమవుతారని కూడా సమాచారం అందుతోంది. అయితే విజయశాంతి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబితే ఆ పార్టీకి పెద్ద షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పదు..!