గుడ్ న్యూస్.. 11,105 గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఈ నోటిఫికేషన్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. మరి ఆ సమయం వచ్చేసింది. తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 11,105 టీచర్‌ పోస్టులని భర్తీ చేస్తున్నారు. అందుకే ఈ మేరకి నోటిఫికేషన్ ని విడుడల చేసింది ప్రభుత్వం. ఇప్పుడు పూర్తి వివరాలని చూసేద్దాం.

గురుకుల నియామక బోర్డు 11,105 టీచర్‌ పోస్టుల కోసం చూస్తోంది. అయితే దీనిలో పీఈటీ, పీడీ తదితర పోస్టులకు న్యాయ వివాదాలు నెలకొనడంతో వాటిని మినహాయించి నోటిఫికేషన్‌లు రిలీజ్ చేసేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన పోస్టులు అన్ని కలిపి త్వరలో ఉద్యోగ ప్రకటనలు చెయ్యాలని చూస్తోంది ప్రభుత్వం.

ఈ వారం లోనే దాదాపు 6 వేలకు పైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని చూస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 45 రోజుల వరకు ఈ పోస్టులకి సాగుతుంది. ఆ తరవాత రాత పరీక్షలు పూర్తి చెయ్యాలని గురుకుల నియామక బోర్డు కార్యాచరణ సిద్ధం చేస్తోందట.

2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలు పూర్తి చేసేలా వుంది. ఈ ప్రకటన తరవాత పరీక్షలకు కనీసం మూడు నెలల సమయం ఉండేలా షెడ్యూల్ చేయబోతున్నారు. ఒక్కో అభ్యర్థి గురుకులాల్లో రెండు లేదా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news