ప్రముఖ ప్రొఫెష్‌నల్ నెట్‌వర్కింగ్ అండ్ జాబ్స్ ప్లాట్‌ఫాం దేశవ్యాప్తంగా పలు కార్యాలయాల్లో నియామకాలు చేపట్టింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 250 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. వివిధ నగరాల్లోని కార్యాలయాల్లో ఇంజినీర్లు, ప్రొడెక్ట్ మేనేజర్లు, బిజినెస్ లీడర్స్ విభాగాల్లో సిబ్బందిని నియమించనున్నారు. ముఖ్యంగా ఇండోర్, పాట్నా, నాగపూర్, హైదరాబాద్, భోపాల్, రాజ్‌కోట్ ప్రాంతాల్లో ఆర్థిక విభాగాల్లో భర్తీ చేయనుంది. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో ఈ యాప్ సేవలు అందిస్తోంది.
అప్నా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఈఓ నిర్మిత్ పారిఖ్ మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించాలన్నదే తమ లక్ష్యంగా తెలిపారు. తమ సంస్థ కార్యక్రమాల ద్వారా దేశ అభివృద్ధి చెందుతుందన్నారు. అంతే కాకుండా అప్నా దేశవ్యాప్తంగా మహిళా శ్రామిక శక్తి అభ్యున్నతికి కృషిచేస్తుందన్నారు. మహిళలకు పార్ట్ టైం, వర్క్ ఫ్రం హోం అవకాశాలను అందిస్తున్నామని అన్నారు.
ఉపాధి అవకాశాలు పొందేందుకు కలిగే ఇబ్బందులను, వాటిని అందిపుచ్చుకొనే అవకాశం అప్నా అందిస్తుందని పారిఖ్ చెబుతున్నారు. అంతేకాదు, ఉద్యోగార్థుల భవిష్యత్తే లక్ష్యంగా తమ సంస్థలు సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.