రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డైట్‌కాలేజీల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ప్రిస్కూల్ ఎడ్యుకేషన్ డిప్లొమాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈ సెట్ 2019 నోటిఫికేషన్ విడుదలైంది.
- డీఈడీలో ప్రవేశాలు (గతంలో టీటీసీ అనేవారు)
- రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్/మైనార్టీ కాలేజీల్లో
- డీఈడీ చేస్తే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హులు
కోర్సు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ).
Deecet -2019 notification released
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయితే 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
వయస్సు: 2019, సెప్టెంబర్ 1నాటికి 17 ఏండ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే డీఈఈసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా.
పరీక్ష విధానం
– ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
– మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం మూడు పార్ట్‌లుగా ఉంటుంది.
పార్ట్-1లో జనరల్ నాలెడ్జ్-10 ప్రశ్నలు- 10 మార్కులు
పార్ట్-2లో జనరల్ ఇంగ్లిష్ -10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ తెలుగు -20 ప్రశ్నలు-20 మార్కులు.
పార్ట్-3లో
మ్యాథ్స్-20 ప్రశ్నలు – 20 మార్కులు.
ఫిజికల్ సైన్సెస్ -10 ప్రశ్నలు – 10 మార్కులు
బయాలజికల్ సైన్సెస్-10 ప్రశ్నలు – 10 మార్కులు
సోషల్ సైన్సెస్ -10 ప్రశ్నలు – 10 మార్కులు
– పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
– పార్ట్ -3లో ప్రశ్నలు పదోతరగతిస్థాయిలో ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: పాత పది జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 4
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఏప్రిల్ 4
పరీక్ష తేదీ: మే 22
వెబ్‌సైట్: http://deecet.cdse.telangana.gov.in
– కేశవ