వర్డ్ ప్రాసెసింగ్ అండ్ డేటా ఎంట్రీ, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, టాలీ, ఎంఎస్ ఆఫీస్, బేసిక్ ఆఫీస్ ఆటోమెషన్ లాంటి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. మూడు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుంది.
నిరుద్యోగులకు శుభవార్త. వాళ్లకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఉన్న కెల్ట్రాన్ స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కాకపోతే ఇది కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే.
ఎస్సీ నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచిత ఉపాధి శిక్షణను అందిస్తున్నారు. జూన్ 6, 2019 నుంచి ఉచిత ఉపాధి శిక్షణ కోసం అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని ట్రెయినింగ్ సెంటర్ నిర్వాహకులు కోరారు. ఈసందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి భూపాల్ రెడ్డి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
వర్డ్ ప్రాసెసింగ్ అండ్ డేటా ఎంట్రీ, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, టాలీ, ఎంఎస్ ఆఫీస్, బేసిక్ ఆఫీస్ ఆటోమెషన్ లాంటి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. మూడు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుంది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు 8455099601 నెంబర్ కు ఫోన్ చేయొచ్చు.