నాగిని హీరోయిన్ ప్లాస్టిక్ స‌ర్జ‌రీ విక‌టించి ఎలా అయిందో చూడండి..!

మౌనీ రాయ్ పై గ‌తంలోనే ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంటుంద‌ని చెప్పి వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆమె ఆ వార్త‌ల‌ను కొట్టి పారేసింది.

నాగిన్ (తెలుగులో నాగిని) సీరియ‌ల్ దేశ వ్యాప్తంగా ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలుసు. ఈ సీరియ‌ల్ హిందీలోనే కాక ప‌లు ఇత‌ర బాష‌ల్లోనూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఇక ఈ సీరియ‌ల్‌లో నాగినిగా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి మౌనీ రాయ్ న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో ఆఫ‌ర్లు కూడా వ‌చ్చాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆమె వార్త‌ల్లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కానీ ఈ మ‌ధ్యే తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో కనిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డ‌మే కాదు, షాక్‌కు కూడా గురి చేసింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

మౌనీ రాయ్ పై గ‌తంలోనే ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంటుంద‌ని చెప్పి వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆమె ఆ వార్త‌ల‌ను కొట్టి పారేసింది. అయితే తాజాగా స‌ల్మాన్‌ఖాన్ న‌టించి భార‌త్ మూవీ ప్రివ్యూ షోకు హాజ‌రైన మౌనీ రాయ్‌ను చూసి జ‌నాలు ఆమె ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్న మాట నిజ‌మేన‌ని తేల్చారు. అంత‌లా ఆమె మారిపోయింది. ఒక‌ప్పుడే ఆమె అందంగా ఉండేది. కానీ ప్లాస్టిక్ స‌ర్జ‌రీ విక‌టించ‌డంతో ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. బుగ్గ‌లు, నుదురు, పెదాలు వాచిపోయాయి. దీంతో ఆమెను ఫ్యాన్స్ తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

సాధార‌ణంగా సినీ న‌టులు త‌మ అందాన్ని క‌రెక్ష‌న్ చేయించుకోవ‌డం కోసం ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంటూ ఉంటారు. ఇక కొంద‌రు న‌టీమ‌ణులు అయితే స్త‌నాల సౌంద‌ర్యం పెంచుకునే బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ స‌ర్జ‌రీల‌ను కూడా చేయించుకుంటున్నారు. అయితే అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే బాగానే ఉంటుంది. కానీ ప్లాస్టిక్ స‌ర్జ‌రీల్లో ఎంత స‌క్సెస్ ఉంటుందో.. అంతే ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌కుండా చాలా మంది న‌టీన‌టులు ప్లాస్టిక్ స‌ర్జరీల వైపు చూస్తున్నారు. చివ‌ర‌కు అవి ఫెయిల‌వుతుండ‌డంతో అంద విహీనంగా మారుతున్నారు. స‌రిగ్గా మౌనీ రాయ్‌కు కూడా ఇలా జ‌రిగింది.

మౌనీ రాయ్‌ చేయించుకున్న ప్లాస్టిక్ స‌ర్జ‌రీ విఫ‌లం కావ‌డంతో ఆమెను అందరూ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాఖీ సావంత్‌, మైకేల్ జాక్స‌న్‌ల‌తో ఆమెను పోలుస్తున్నారు. వారు కూడా ప్లాస్టిక్ స‌ర్జ‌రీ విఫ‌లం అయి అంద విహీనంగా మారార‌ని, ఇప్పుడు మౌనీ రాయ్ కూడా అలాగే త‌యారైంద‌ని ఆమెను విమ‌ర్శిస్తున్నారు. అవును మ‌రి.. ఉన్న అందాన్ని లెక్క‌చేయ‌కుండా అత్యాశ‌కు పోతే ఎవ‌రికైనా ఇలాగే జ‌రుగుతుంది. అది తెలుసుకుని మ‌స‌లుకుంటే బెట‌ర్‌. లేక‌పోతే ఇలాగే అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తుంది..!