ఈ పద్ధతులని అనుసరిస్తే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి…!

-

పరీక్షలో మంచి మార్కులు రావాలన్నా, ర్యాంకులు రావాలన్న ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. విద్యార్థులు ఈ టిప్స్ ని కనుక అనుసరించారు అంటే సాధారణ పరీక్షల నుండి కాంపిటీటివ్ పరీక్షలు వరకు ఏ పరీక్షలైన మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు అంటున్నారు.

చాలా మంది విద్యార్థులకు సామర్థ్యం ఉంటుంది. తెలివితేటలు ఉంటాయి. జ్ఞాపక శక్తి ఉంటుంది. కానీ మంచి ఫలితాలు రావు. అయితే అలంటి వాళ్ళు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని చదివితే పరీక్షల్లో మంచి ఫలితాలు పొందవచ్చు అని నిపుణులు చెప్పడం జరిగింది. అయితే మరి ఆ సులువైన టిప్స్ కోసం మనం ఇప్పుడే చూద్దాం.

ఒత్తిడి తీసుకోవద్దు:

ఎప్పుడూ కూడా ఒత్తిడి లేకుండా ఉంటేనే విజయాన్ని మీరు పొందగలరు. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడిని తగ్గించుకోండి. కాసేపు ధ్యానం చేయడం. వినోద కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించడం లాంటివి చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి లేకుండా మీరు ప్రశాంతంగా పరీక్షలు రాసి సక్సెస్ అవ్వగలరు.

ముఖ్యమైన టాపిక్స్ ని గుర్తుపెట్టుకోండి:

తక్కువ సమయం ఉన్నప్పుడు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. తరచుగా అడిగే ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలను బాగా గుర్తు పెట్టుకోండి. దీంతో పరీక్ష బాగా రాయడానికి వీలవుతుంది.

టైం టేబుల్ తయారు చేసుకోండి:

మీకు ఉన్న సిలబస్ ఆధారంగా టైం టేబుల్ ని తయారు చేసుకోండి. టైం టేబుల్ ఉండడం వల్ల ఏం చదివారు, ఎంత సిలబస్ పూర్తయింది, ఇంకా ఎంత మిగిలింది అనేవి మీకు తెలుస్తాయి.

పాజిటివ్ గా ఉండాలి:

ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచనలతో చదువుకోవడం మంచిది కాదు. మీ పై మీకు నమ్మకం ఉండాలి అదే విధంగా పాజిటివిటీని పెంచుకోండి. ఇలా మంచిగా ఫలితాలు పొందడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news