ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యొగుల కలలను తీర్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న ఉద్యోగాలకు సంభందించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తూ వస్తుంది.ఇప్పటికే ఎన్నో ఉద్యొగాలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసింది.అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వాలని అనుకోనేవారికి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.కరీంనగర్ లో ఏర్పాటైన ఐటీ టవర్ నుంచి తొలిసారిగా ఒక పీపుల్ ఫ్రెండ్లీ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్ ను అందుబాటులో కి తెచ్చింది ఓ టీమ్.

గవర్నమెంట్ ఉద్యొగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ ఐటీ కేంద్రంగా పనిచేస్తున్న” టీమ్ అప్” అనే సాఫ్ట్ వేర్ కంపెనీ నిపుణులు ఓ సరికొత్త యాప్ వారధి ను రూపొందించారు. ఈ యాప్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు.జాబ్ కి ప్రిపేరవుతున్న వారికి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తరపున ఓ సరికొత్త యాప్ ను స్థానిక ఐటీ టవర్ నిపుణల సహాయంతో అందుబాటులోకి తెచ్చారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా పనిచేస్తున్న వారధి అనే సంస్థ ద్వారా ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పిస్తుండటంతో పాటు అనేక రకాల వృత్తులకు సంబంధించిన శిక్షణలు కూడా అందించనున్నారు.

ఈ యాప్ ను కరీంనగర్ ఐటీ టవర్ కేంద్రంగా పనిచేస్తున్న టీమ్ అప్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిపుణులు తయారు చేసారు. వారధి అనే పేరుతో గూగూల్ ప్లే స్టోర్ లో సెర్చ్ చేసి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ యాప్ ను అందరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారి విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో 90 వేల ఉద్యోగాలు ప్రకటించగా, 10 వేల ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ మార్చి నెలలో ప్రకటించారు. ఇందులో భాగంగానే పోలీస్ బోర్డ్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర డిపార్ట్ మెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. టీఎస్‌పీఎస్సీ సైతం గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలను విడుదల చేస్తుంది.