నిరుద్యోగులకు శుభవార్త… హెటిరో డ్రగ్స్‌లో ఉద్యోగాలు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హెటిరో డ్రగ్స్ ‌లో పలు ఖాళీలని భర్తీ చేస్తున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC నిర్వహించగా… దీనిలో భాగంగా 2021 ఏప్రిల్ 28న విజయనగరం లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ని నిర్వహిస్తోంది.

దీనిలో మొత్తం మొత్తం ఖాళీలు- 175. జూనియర్ కెమిస్ట్- 100, ట్రైనీ- 30, జూనియర్, టెక్నీషియన్- 25, ట్రైనీ- 25 వున్నాయి. హెటిరో డ్రగ్స్‌లో హైదరాబాద్, విశాఖపట్నం లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చెయ్యొచ్చు. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ట్విట్టర్‌లో వెల్లడించింది.

ఇక అర్హత విషయం లోకి వస్తే… జూనియర్ కెమిస్ట్ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ పాస్ కావాలి. అదే ట్రైనీ పోస్టుకు అయితే బీ ఫార్మసీ, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ పాస్ కావాలి. అలానే జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు ఫిట్టర్ ట్రేడ్‌ లో ఐటీఐ పాస్ కావాలి. ట్రైనీ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ కావాలి. వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

2021 మార్చి 28 ఉదయం 10 గంటల నుంచి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఉంటుంది. ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్, తోటపాలెం, నాయుడు కాలనీ, విజయనగరం వద్ద స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఉంటుంది. రూ.10,000 నుంచి రూ.16,000 వరకు వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, క్యాంటీన్ ఫెసిలిటీ, ప్రతీ ఏటా ఇంక్రిమెంట్, బోనస్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి. హైదరాబాద్, విశాఖపట్నం లో పని చెయ్యాల్సి ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news