జేఈఈ మెయిన్లో ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే !!

-

జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ సోమవారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 345 కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్క్ పరీక్షకు 1,38,409 మంది విద్యార్థులు, 327 కేంద్రాల్లో నిర్వహించిన బీప్లానింగ్ పరీక్షకు 59,003 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ (జనవరి)-2020 పరీక్షలు సోమవారం (జనవరి 6) ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 6 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలో మొదటి రోజైన జనవరి 6న పేపర్-2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్ష నిర్వహించారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించగా.. మధ్యాహ్నం సెషన్ పరీక్షను 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
బీఆర్క్, బీప్లానింగ్ అభ్యర్థులకు వేర్వేరుగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. ఆర్కిటెక్చర్ (బీఆర్క్)‌ విభాగంలో మ్యాథమెటిక్స్ (పార్ట్-1), ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2)ను ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించగా.. డ్రాయింగ్ టెస్ట్ (పార్ట్-3)ను పేపర్, పెన్ను (ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహించారు. ఇక బీప్లానింగ్ అభ్యర్థులకు విభాగంలో మ్యాథమెటిక్స్ (పార్ట్-1), ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2), ప్లానింగ్ (పార్ట్-3) పరీక్షలను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించారు.

పరీక్ష రాసిని విద్యార్థుల మాటల్లో….
* బీఆర్క్ పరీక్షకు హాజరైన విద్యార్థులు పరీక్షలో అడిగిన ప్రశ్నల గురించి స్పందిస్తూ.. పరీక్షలో మ్యాథమెటిక్స్ (పార్ట్-1)లో ప్రశ్నలు చాలా కఠినంగా ఇచ్చారని.. కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకోవడమే కష్టమైందన్నారు. ఎక్కువ ప్రశ్నలు ఫస్ట్‌ ఇయర్‌ నుంచి అడిగారన్నారు. వీటిలో కాలిక్యులస్, బైనామియల్, పర్మూటేషన్స్ & కాంబినేషన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు విద్యార్థులు వెల్లడించారు.
* ఇక పార్ట్-2ఆప్టిట్యూడ్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ విభాగంలో ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని విద్యార్థులు అన్నారు.
* డ్రాయింగ్ టెస్ట్ కూడా కఠినంగా ఉందంటున్నారు.
* డ్రాయింట్ టెస్ట్‌లో రెండు 50 మార్కుల ప్రశ్నలు కాస్త కఠినంగా ఉన్నాయని.. ఎక్కువ సమయం తీసుకుందని విద్యార్థులు తెలిపారు. మొత్తంగా చూస్తే జేఈఈ మెయిన్ 2020 మొదటిరోజు మొదటి షిఫ్టు పరీక్షలో ప్రశ్నల సరళి మిశ్రమంగా సాగిందని చెప్పవచ్చు.
ఇది ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం. రేపటి పరీక్ష ఇలానే ఉంటుందని భావించవద్దు.
ques

Read more RELATED
Recommended to you

Latest news