ఇండియన్‌ ఆయిల్‌ సంస్థలో ఉద్యోగాలు!

నిరుద్యోగులకు ఇండియన్‌ ఆయిల్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ భర్తీని గేట్‌–2021 స్కోరు ఆధారంగా ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లను నియామకం చేపట్టనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఆన్‌ లైన్‌ లోనే నిర్వహిస్తామని తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ముందుగా గేట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల జాబితాను షార్ట్‌లిస్ట్‌ చేయనున్నారు.ఆ తర్వాత అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను నియమించుకోనున్నారు.

ఇండియన్‌ ఆయిల్‌

ఖాళీలు..

కెమికల్, సివిల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 26లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు వారి కేటగిరీ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దర ఖాస్తు చేసుకునేటపుడు అభ్యర్థులు తమ ఈ–మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌త రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి. అప్లికేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేసి, సూచనలను జాగ్రత్తగా చదవాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు వారి కేటగిరీ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారిని జనరల్‌ కేటగిరీలోని వారిగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఆన్‌ లైన్‌ దరఖాస్తు ఫాంను నింపాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌.. అంటే/7+ ఇటీవలి కలర్‌ పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోగ్రాఫ్‌, సంతకం స్కాన్‌ చేసిన కాపీ, ఆధార్‌ కార్డు వంటివి అప్‌లోడ్‌ చేయాలి. ఒక్కసారి ఆన్‌ లైన్‌ దరఖాస్తు సబ్‌మిట్‌ చేశాక ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని అభ్యర్థులు గుర్తించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌ లైన్‌ దరఖాస్తు ఫారమ్‌ను పిడిఎఫ్‌ ఫార్మాట్‌లో ప్రింటవుట్‌ తీసుకొని భద్రపర్చుకోవాలి.