భారీగా పడిపోయిన వెండి ధర.. బంగారం మాత్రం షాక్!

-

న్యూఢిల్లీ: బంగారం కొనుగోలుదారులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ప్రతి రోజూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతకొంతకాలంగా చూసుకుంటే పెరిగిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడికో ఎందుకు నిన్నటి ధరతో పోల్చుకుంటే ఇవాళ బంగారం ధర పెరిగింది.

తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 110, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 వరకూ పెరిగింది. దేశీయంగా ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,990గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900గా విక్రయాలు జరుగుతున్నాయి.

 

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900గా ఉంది. విశాఖ, విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండిపై రూ. 5,200 తగ్గింది. ఇవాళ కిలో వెండి ధర రూ. 69,200గా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..
చెన్నై: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,310. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,430
ముంబై: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,080, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,080
ఢిల్లీ: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,100
కలకత్తా: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ50,100
బెంగుళూరు: 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,980

 

Read more RELATED
Recommended to you

Latest news