బ్లాక్ బస్టర్ బాహుబలి లాంటి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ROAR OF RRR RRR మేకింగ్ వీడియోను ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించేసింది చిత్ర యునిట్. ఎన్టీఆర్, చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని రెండు సాంగులను చిత్రీకరించుకుంటోంది. ఈ సినిమాలు అక్టోబర్ 13న దసరా పండుగ సందర్భంగా దాదాపు పది భాషల్లో భారీగా విడుదల చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా ఆర్ఆర్ సినిమా నుంచి మరో అదిరిపోయే అనౌన్స్మెంట్ చేసింది చిత్ర బృందం. రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ పేరుతో ఈ సినిమాకు చెందిన మేకింగ్ వీడియోను ఈనెల 15 అంటే ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది. అయితే ఇవాళ విడుదల చేసే మేకింగ్ వీడియోలో అసలు ఏముంటుందో… అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే దీని పై క్లారిటీ రావాలంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో ప్రకటనతో ఈ సినిమా హైప్ మరింత పెరిగింది. కాగా ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ను ఆర్‌ఆర్‌ఆర్ టీం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం భీమ్ గా బైక్ నడుపుతుంటే… ఆ వెనకే చిరునవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్.
R U READY ……….
A glimpse into the making of RRR
Tomorrow July 15th, at 11 AM…..#RoarOfRRR 💥💥💥@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies #RRRMovie pic.twitter.com/tKcultRVGh— KK Senthil Kumar ISC (@DOPSenthilKumar) July 14, 2021