నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇస్రో లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

-

నిరుదోగులకి గుడ్ న్యూస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ – ఇస్రో ISRO నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. మొత్తం 43 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 ఇస్రో/ ISRO
ఇస్రో/ ISRO

2018, 19, 20, 21 సంవత్సరాల్లో బీఈ, బీటెక్ లేదా డిప్లొమో చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. అయితే పర్మినెంట్ చేసే అవకాశం మాత్రం లేదని నోటిఫికేషన్లో చెప్పారు.

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. సివిల్ ఇంజనీరింగ్ – 3, మెకానికల్ ఇంజనీరింగ్ – 1,
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ – 1, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 3, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ – 2, టెక్నాలజీ అండ్ సేఫ్టీ – 2. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని ఫస్ట్ క్లాసులో పూర్తి చేసి 60 శాతం మార్కులు సాధించిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు

అలానే సివిల్ ఇంజనీరింగ్ – 3, మెకానికల్ ఇంజనీరింగ్ – 2, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ – 2,
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-3, డిప్లొమో ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ -21
పోస్టులు వున్నాయి. ఈ పోస్టులకి డిప్లొమాలో అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఈ నెల 22లోగా అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలని ఈ లింక్ లో చూడచ్చు. https://www.isro.gov.in/sites/default/files/apprenticeship_notification_2021-22.pdf

Read more RELATED
Recommended to you

Latest news