మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్-2019

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను మే 27న నిర్వహించనున్నట్లు నిర్వాహక సంస్థ ఐఐటీ రూర్కీ ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా దేశంలోని 23 ఐఐటీలతోపాటు మరికొన్ని జాతీయస్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, డ్యూయెల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీ: మే 27  (పేపర్-1 ఉదయం 9 నుంచి 12, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు) ఐఐటీ రూర్కీ ప్రకటించిన ముఖ్యతేదీల సమాచారం…

జేఈఈ మెయిన్ (రెండో సెషన్) – ఏప్రిల్ 8 నుంచి 12 వరకు
జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి – ఏప్రిల్ 30
జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్- మే 3 నుంచి 9 వరకు
ఫీజీ చెల్లించడానికి చివరితేదీ – మే 10
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడింగ్ – మే 20 నుంచి 27 వరకు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ – మే 27
ఫలితాల వెల్లడి – జూన్ 14
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – జూన్ 14, 15
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – జూన్ 17
ఆర్కిటెక్చర్ టెస్ట్ ఫలితాల వెల్లడి – జూన్ 21
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://jeeadv.ac.in

– కేశవ