హైదరాబాద్‌ మౌలానా ఆజాద్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చెయ్యండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. హైదరబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

we are hiring

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఈ నోటిఫికేషన్ లో భాగంగా 88 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్లు, అసొసియేట్‌ ప్రొఫెసర్లు (71), మోడల్‌ స్కూల్‌ టీచర్ (17) ఖాళీలు ఉన్నాయి. అరబిక్‌, హిందీ, ఇంగ్లిష్‌, ఉమెన్‌ ఎడ్యుకేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఇస్లామిక్‌ స్టడీస్, సోషల్‌ వర్క్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, సోషియాలజీ పోస్టులు వున్నాయి.

ఇక అర్హత వివరాల లోకి వెళితే.. సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అకడమిక్‌ అర్హత, పని అనుభవం ఆధారంగా షార్ట్‌ లిస్టింగ్‌ చేస్తారు. ఆ తరవాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు.

ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలానే టీచింగ్ లో అనుభవం కూడా ఉండాలి. అలానే మోడల్ స్కూల్ టీచర్‌ పోస్టుల్లో అయితే హెడ్‌ మాస్టర్‌, టీజీటీ, పీజీటీ, యోగా టీచర్‌, ప్రైవరీ టీచర్‌ పోస్టులును భర్తీ చేయనున్నారు.

దరఖాస్తులకు రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ కింద అడ్రెస్ కి పంపాల్సి వుంది. రూమ్‌ నెం10, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దు యూనివర్సిటీ, ఉర్దు యూనివర్సిటీ రోడ్‌, గచ్చిబౌలి, హైదరబాద్‌ 500032 అడ్రస్‌కు పంపించాలి. పూర్తి వివరాలని https://manuu.edu.in/ లో చూసి అప్లై చేసుకోచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.