రాఘవ ఎక్కడ..ప్రగతి భవన్ లోనా… ఫాంహౌస్ లోనా? : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో… కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వారసుడు వనమా రాఘవ వ్యవహారం ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ఇంతకాలం సైలెంట్‌గా సెటిల్‌మెంట్లు వ్యవహారం నడిపించిన రాఘవ…ఇప్పుడు ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అయితే.. ఈ వ్యవహారం తాజాగా మరోసారి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.

కీచవ రాఘవ ఎక్కడ..? ప్రగతి భవన్ లోనా. ఫామ్ హౌస్ లోనా ? అని ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ చేసి పోలీసులు… మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేక పోవడం ఏమిటి ? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆ దుర్మార్గుడుని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు ? ఇంత దారుణ ఘటనపై టిఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేమిటి ..? అని రేవంత్ రెడ్డి ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. కాగా.. నిన్న రాఘవను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు వార్తలు రాగా.. ఇవాళ తాము అరెస్ట్‌ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ కేసు మరింత హాట్‌ టాపిక్‌ గా మారింది.