హైదరాబాద్‌లో దారుణం..కన్న కొడుకుపై తండ్రి లైంగిక దాడి !

హైదరాబాద్‌లోని..ఉప్పల్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకుపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో తన భర్త నుండి తనను తన కుమారుడిని రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ భార్య. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హబ్సిగూడ కు చెందిన వీణారెడ్డికి ఉప్పల్ కు చెందిన భరత్ రెడ్డితో గత ఎనిమిదియేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే… ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

డైవర్స్ ఇష్యూ కోర్టులో నడుస్తున్న సమయంలో కొడుకును తనకు అప్పగించేలా చూడాలని కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశాడు భరత్ రెడ్డి. ఈ పిటీషన్‌ పై విచారించిన కోర్టు వారానికి ఒకసారి కొడుకుని కలుసుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది. అయితే.. తన కొడుకును తీసుకెళ్లి.. లైంగిక వేధింపులకు తన భర్త పాల్పడుతున్నాడంటూ… వీనారెడ్డి ఆరోపణలు చేసింది. అటు బాబుపై లైంగిక వేధింపులు జరిగినట్టు వైద్యులు కూడా నిర్దారించారు. దీంతో బాబును భర్త భరత్ రెడ్డి వద్దకు అస్సలు పంపబోనని వీణారెడ్డి చెబుతోంది. తనకు బాబుకు భర్త నుండి రక్షణ కల్పించాలని పోలీసులను కూడా వీణారెడ్డి ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.