గుడ్ న్యూస్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు… వివరాలు ఇవే…!

Join Our Community
follow manalokam on social media

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? డిగ్రీ ప్యాస్ అయ్యిపోయారా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగ అభ్యర్థులకు సూపర్ న్యూస్ తీసుకొచ్చింది. దీనితో ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి ఊరట కలుగుతుంది. పూర్తి వివరాల లోకి వెళితే… పంజాబ్ నేషనల్ బ్యాంక్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. 100 ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇక నోటిఫికేషన్ గురించి చూస్తే… పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి 15వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలని https://www.pnbindia.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు. ఇక ఈ పోస్ట్ కి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే… 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపికైన వాళ్లకి నెలకు 48,170 రూపాయల నుంచి 69,810 రూపాయల వరకు జీతం వస్తుంది. https://www.pnbindia.in/ వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకుని…దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కట్టి దరఖాస్తు ఫీజుకు సంబంధించిన వోచర్ ను జత చెయ్యాలి. వీటిని chief manager (recruitment section), hrm division, punjab national bank, corporate office plot no 4, sector 10, dwarka , new delhi – 110075 కి పంపాల్సి ఉంటుంది.

 

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...