తెలంగాణ ఎక్సైజ్ శాఖ‌లో 614 కానిస్టేబుల్ పోస్టులు.. వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలోని నిరుద్యోగుల కి శుభవార్త చెప్పనుంది. వరుసగా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లని విడుదల చేసింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌తో పాటు పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేష‌న్‌లు కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇక వయస్సు వివరాలని చూస్తే.. జూలై 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాట‌కుండా ఉండాలి. 2000 జూలై 2, కంటే ముందు పుట్టి ఉండ‌కూడ‌దు. జూలై 1, 2004 త‌ర్వాత పుట్టి ఉండ‌కూడ‌దు. అలానే రెండేళ్ల కాలంలో 365 రోజులు పని చేస్తూ ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న హోంగార్డులైతే 18 ఏళ్ల వ‌య‌సు నిండి 40 ఏళ్లు ఉండాలి.

ఆ వయస్సు దాటకూడదు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక శాలరీ విషయానికి వస్తే.. రూ.24,280 నుండి రూ.72,850 పే చేయనున్నారు. అర్హతల విషయానికి వస్తే.. ఇంట‌ర్మీడియ‌ట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది మే 20, 2022. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://www.tslprb.in/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news