బండి సంజయ్ పై తంబాకు, లవంగం ఫైల్స్ సినిమాలు తీస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బండి సంజయ్ కుమార్ ది పాదయాత్ర కాదని.. పాపాల యాత్ర అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ పనికి మాలిన పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను హత్య చేశానని జగ్గారెడ్డి అంటున్నాడని.. ఆనాడు కాంగ్రెస్ పాలనలో విప్ గా ఉన్నావు కదా… ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర నీదని.. సమైక్యవాది అని జగ్గారెడ్డి చెప్పుకుంటున్నాడని ఏపీకి పోయి బతకాలని అన్నారు. రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాడని మాట్లాడుతున్నాడని విమర్శించారు. నీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడని.. జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారని… కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమే అని విమర్శించారు.